తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం
- పవన్ కల్యాణ్ ను కలిసిన కిషన్ రెడ్డి, రాంచందర్ రావు
- బీజేపీకి పవన్ మద్దతు ప్రకటించారన్న రాంచందర్ రావు
- బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని వెల్లడి
పవన్ కల్యాణ్ తో తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయినట్టు రాంచందర్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారని... బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని పేర్కొన్నారు. పవన్ మద్దతు తెలంగాణ బీజేపీకి తిరుగులేని బలాన్ని, వేగాన్ని ఇస్తుందని అన్నారు.