'కిష్కిందపురి' ప్రీమియర్ షో టాక్!
- బెల్లంకొండ హీరోగా 'కిష్కిందపురి'
- రేపు విడుదలవుతున్న సినిమా
- దెయ్యం పాత్రలో అనుపమా పరమేశ్వరన్
- హారర్ ఎలిమెంట్స్ హైలైట్ అంటూ టాక్
సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి కౌశిక్ దర్శకత్వం వహించాడు. టైటిల్ తోనే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్స్ కూడా అంచనాలు పెంచుతూ వచ్చాయి. అందరిలో కుతూహలం పెరగడంలో అనుపమా పరమేశ్వరన్ లుక్ కీలకమైన పాత్రను పోషించిందని చెప్పాలి. అలాంటి ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ క్రిటిక్స్ కోసం ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమా చూసినవాళ్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా .. క్లారిటీతో చెప్పాడని అంటున్నారు. బెల్లంకొండ - అనుపమ పాత్రలను డిజైన్ చేసిన తీరు, హారర్ ఎలిమెంట్స్ ను ఆవిష్కరించిన విధానం హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. దెయ్యం ఆవహించిన పాత్రలో అనుపమ మరిన్ని మార్కులు కొట్టేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్టాఫ్ కి మించి సెకండాఫ్ థ్రిల్ చేసిందనీ, ఈ సినిమాతో బెల్లంకొండకి హిట్ పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. చూడాలిమరి .. రేపు థియేటర్స్ లో ఆడియన్స్ ఏమంటారో!