'కింగ్డమ్' ట్రైలర్.. విజయ్ దేవరకొండ మాస్ ట్రీట్
- విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో 'కింగ్డమ్'
- తిరుపతిలో జరిగిన ఈవెంట్లో మూవీ ట్రైలర్ను విడుదల చేసిన మేకర్స్
- ప్రేక్షకులను ఆకట్టుకునేలా విజయ్ చేసిన యాక్షన్, చెప్పిన డైలాగ్స్
- ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న రౌడీ బాయ్
- ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
ట్రైలర్లో విజయ్ చేసిన యాక్షన్, చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆయన మేకోవర్ కూడా కొత్తగా ఉంది. మరోవైపు, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కూడా తన సంగీతంతో ఈ ట్రైలర్ను ఎక్కడికో తీసుకెళ్లారు.
గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ నటిస్తుండగా... సత్యదేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 31న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.