హాట్ స్టార్ లో తమిళ క్రైమ్ థ్రిల్లర్!
- అథర్వ మురళి హీరోగా రూపొందిన DNA
- కథనాయికగా నిమిషా సజయన్
- 'ఫర్హానా' దర్శకుడి మరో ప్రయత్నం
- కిడ్నాప్ చేయబడిన పసిబిడ్డ చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 19 నుంచి మొదలయ్యే స్ట్రీమింగ్
అథర్వ మురళి సరసన నిమిషా సజయన్ నటించింది. ఈ సినిమాలో ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమాను జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ .. మలయాళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది.
ఈ సినిమాలో హీరో - హీరోయిన్ భార్యాభర్తలు. తొలి సంతానం విషయంలో వాళ్లిద్దరూ ఎన్నో కలలు కంటారు. వారికి ఒక బిడ్డ కలుగుతుంది. అయితే ఆ బిడ్డ తమ బిడ్డ కాదనే అనుమానం వారికి కలుగుతుంది. DNA టెస్ట్ చేయించడంతో వారి అనుమానం నిజమవుతుంది. తమ బిడ్డ ఏమైపోయింది? ఎవరు కిడ్నాప్ చేయించారు? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ జంట చేసే పోరాటమే ఈ సినిమా.