బ్రేకింగ్ న్యూస్: గోవాలోని లైరాయిదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి దుర్మరణం
- 30 మందికిపైగా గాయాలు
- క్షతగాత్రులను రెండు ఆసుపత్రులకు తరలించిన అధికారులు
- ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించిన సీఎం సావంత్
శ్రీ లైరాయి దేవి జాతరను ఏడాదికోసారి నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు గోవా వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తుంటారు. లైరాయిదేవిని పార్వతీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ పండుగలో సంప్రదాయ ‘ధోండాచి’లో భాగంగా వేలాదిమంది భక్తులు పాదరక్షలు లేకుండా మండుతున్న నిప్పులపై నడుస్తారు. వేడుకలో సంప్రదాయ డప్పుచప్పుళ్లు, భక్తిగీతాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరుగుతుంది.