ప్రణయ్ హత్య కేసులో తీర్పుపై స్పందించిన అమృత
- ఈ కేసులో న్యాయం జరిగిందన్న అమృత
- పరువు పేరిట చేసే దురాగతాలు ఈ తీర్పుతో తగ్గుముఖం పడతాయని ఆకాంక్ష
- తాను ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించలేనని వెల్లడి
ఈ కేసులో న్యాయం జరిగిందని, పరువు పేరిట చేసే దురాగతాలు ఈ తీర్పుతో అయినా తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తన నిరీక్షణ ముగిసిందని, న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన హృదయం భావోద్వేగాలతో నిండిపోయిందని రాసుకొచ్చారు. తనకు అండగా నిలిచిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే అతని భవిష్యత్తును కాపాడుకోవడానికి నేను మీడియా ముందు కనిపించలేనని అన్నారు. తాను ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించలేనని పేర్కొన్నారు. దయచేసి మా శ్రేయోభిలాషులందరూ తమ గోప్యతను అర్థం చేసుకొని గౌరవించాలని అభ్యర్థిస్తున్నానని ఆమె రాసుకొచ్చారు.