పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి స్వరా భాస్కర్
- సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ అహ్మద్ ను పెళ్లాడిన స్వరా భాస్కర్
- ఈ నెల 23న కూతురు జన్మించినట్టు ప్రకటించిన స్వర
- కూతురుకి రుబియా అనే పేరు పెడుతున్నట్టు వెల్లడి
స్వర భర్త ఫహాద్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ నేత కావడం గమనార్హం. 2023 జనవరి 6న వీరు పెళ్లి చేసుకున్నారు. వీరు తొలుత కోర్టు ద్వారా రహస్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మార్చిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. తాను తల్లిని కాబోతున్నట్టు మార్చిలో ఆమె ప్రకటించారు. బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.