త్రిష 'ది రోడ్' నుంచి రానున్న అప్ డేట్!
- త్రిష ప్రధానమైన పాత్రధారిగా 'ది రోడ్'
- యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా
- దర్శకత్వం వహించిన వశీగరన్
- అక్టోబర్ 6వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాలో త్రిష జర్నలిస్టుగా .. ఏడేళ్ల బిడ్డకి తల్లిగా కనిపించనుంది. కథా పరంగా చెప్పాలంటే ఇది ఒక రివేంజ్ స్టోరీ. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. రేపు ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. అరుణ్ వశీగరన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
అక్టోబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వెల్ రామ్మూర్తి .. మియా జార్జ్ .. ఎమ్మెస్ భాస్కర్ ... వివేక్ ప్రసన్న .. షాబీర్ .. సంతోష్ ప్రతాప్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదలవుతున్న ఈ సినిమా, ఏ స్థాయి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.