సోనీ లివ్ కి మరో టీనేజ్ లవ్ స్టోరీ .. 'జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్'
- మలయాళంలో రూపొందిన 'జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్'
- జులైలో విడుదలై హిట్ కొట్టిన సినిమా
- ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- ప్రధాన పాత్రల్లో నస్లీన్ - మాథ్యూ
నస్లీన్ కె గఫూర్ .. మాథ్యూ థామస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అరుణ్ డి జోస్ దర్శకత్వం వహించాడు. ఇది టీనేజ్ లవ్ స్టోరీ .. రొమాన్స్ తో కూడిన కామెడీ డ్రామా. మలయాళంలో జులై 7వ తేదీన విడుదలైన ఈ సినిమా, సింపుల్ కంటెంట్ తో అక్కడి యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
అలాంటి ఈ సినిమాను ఈ నెల 15వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఓటీటీలో వచ్చిన 'నెయిమర్' సినిమాతో, మిగతా భాషల వారికి కూడా నస్లీన్ - మాథ్యూ పరిచయమయ్యారు. అందువలన సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి ఉంది. ఇతర పాత్రల్లో మీనాక్షి .. నిఖిలా విమల్ .. బినూ పప్పు కనిపించనున్నారు. ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది చూడాలి.