సీనియర్ నటుడు అర్జున్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు
- అర్జున్ కుమార్తె ఐశ్వర్యకు నటుడు తంబి రామయ్య కుమారుడితో వివాహం
- వచ్చే ఏడాది పెళ్లి జరుగుతుందన్న తంబి రామయ్య
- తంబి రామయ్య కుమారుడు ఉమాపతి కూడా నటుడే!
ఉమాపతి కూడా సినీ నటుడే. కాగా, అర్జున్ కుమార్తె ఐశ్వర్యను ఇష్టపడుతున్నట్టు ఉమాపతి తన తల్లిదండ్రులకు చెప్పడం, వారు అర్జున్ కుటుంబ సభ్యులతో మాట్లాడడం చకచకా జరిగిపోయాయి. నవంబరు 8న ఉమాపతి పుట్టినరోజు కాగా, అదే రోజున పెళ్లి జరిగే తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది పెళ్లి జరగొచ్చని తంబి రామయ్య తెలిపారు.