హరీశ్ శంకర్ దర్శకత్వంలో ప్రభాస్!
- అభిమానులను నిరాశపరిచిన 'ఆదిపురుష్'
- ప్రభాస్ చేతిలో మరో నాలుగు ప్రాజెక్టులు
- అందులో రెండు పాన్ ఇండియా సినిమాలు
- ఆయనతో మరో భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్న కన్నడ నిర్మాణ సంస్థ
'సలార్' .. 'ప్రాజెక్టు K' ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలోవే కావడం విశేషం. ఇక 'స్పిరిట్' గురించిన విశేషాలు పెద్దగా బయటికి రాలేదుగానీ, మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'రాజా డీలక్స్' ఓ మాదిరి బడ్జెట్ లోనిదే. ఆ తరువాత ప్రాజెక్టును ప్రభాస్ ఎవరితో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే హరీశ్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది కన్నడలో భారీ చిత్రాలను నిర్మించిన KVN ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. జోనర్ కి సంబంధించిన విషయాలతో పాటు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా సమాచారం. కథానాయిక విషయంలో కూడా అప్పుడే క్లారిటీ రానుంది.