లెక్క సరిచేసిన సల్మాన్.. విక్కీ కౌశల్ కు ఆత్మీయ హగ్.. ఇదిగో వీడియో!
- ఐఫా వేడుకల్లో విక్కీ కౌశల్ ను నెట్టేసిన సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది
- సల్మాన్, ఆయన బాడీ గార్డుల తీరుపై విమర్శలు
- తాజాగా విక్కీ కౌశల్ వద్దకు వెళ్లి ఆత్మీయంగా హత్తుకున్న సల్మాన్
24 గంటలు గడవకముందే మరో వీడియో బయటికి వచ్చింది. ఓ కార్యక్రమంలో ఇద్దరూ వేదికపైనే ఉండగా.. మీడియాతో మాట్లాడుతూ విక్కీ కనిపించారు. ఆయన వద్దకు నేరుగా వెళ్లిన సల్మాన్.. ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇరువురూ నవ్వుతూ పలకరించుకున్నారు. ఈ వీడియోను సల్మాన్ అభిమానులు బాగా వైరల్ చేస్తున్నారు.
మరోవైపు ‘తోసేసిన’ ఘటనపై విక్కీ కౌశల్ స్పందించారు. ‘‘కొన్ని సార్లు అనవసర విషయాలు కూడా పెద్దవిగా కనపడతాయి. వీడియోలో కనిపించినట్లుగా అక్కడ అలాంటిదేమీ జరగలేదు. అసలు ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా ఏమీ లేదు’’ అని చెప్పారు. వివాదం పెద్దది కాకుండా చేశారు.