సుప్రీంకోర్టులో వైఎస్ అవినాశ్ రెడ్డికి చుక్కెదురు
- సుప్రీం వెకేషన్ బెంచ్ లో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్
- టీఎస్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచన
- అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని సుప్రీం స్పష్టీకరణ
మరోవైపు విచారణ సందర్భంగా... సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు లాయర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం తిరస్కరించడంతో... ఇప్పుడు సీబీఐ అధికారలు ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇంకోవైపు, సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సీబీఐ తరపున న్యాయవాది హాజరుకాకపోవడం గమనార్హం.