'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్!
- నాగశౌర్య నుంచి మరో ప్రేమకథ
- మరోసారి ఆయన జోడీగా మాళవిక నాయర్
- దర్శకత్వం వహించిన అవసరాల శ్రీనివాస్
- ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి ఇవాళే కలిశారు తొలిసారిగా' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో - హీరోయిన్ ముద్దుముచ్చట్లు .. సరదాలు .. సందళ్లు .. అలకలు .. అల్లర్లపై ఈ పాటను చిత్రీకరించారు.
కల్యాణి మాలిక్ ఈ పాటను స్వరపరచడమే కాకుండా, నూతన మోహన్ తో కలిసి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. నాగశౌర్య - మాళవిక నాయర్ గతంలో 'కల్యాణ వైభోగమే' సినిమా చేశారు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఈ నెల 17న రానున్న ఈ సినిమా అయినా, ఈ ఇద్దరికీ సక్సెస్ ను తెస్తుందేమో చూడాలి.