'వారసుడు' విషయంలో వెనక్కి తగ్గిన దిల్ రాజు?
- సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు
- సంక్రాంతి బరిలో దిల్ రాజు 'వారసుడు' సినిమా కూడా
- విడుదల వాయిదా వేయాలనుకుటున్న దిల్ రాజు
ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్న తరుణంలో తమిళ హీరోతో తీసిన సినిమాను విడుదల చేస్తున్నారంటూ ఇప్పటికే దిల్ రాజుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'వారసుడు' సినిమాను వాయిదా వేయాలని దిల్ రాజు నిర్ణయించినట్టు సమాచారం. తమిళ వర్షన్ ను జనవరి 11నే విడుదల చేస్తున్నప్పటికీ... తెలుగు వర్షన్ విడుదల మాత్రం వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.