తన పేరు మీదే కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ప్రకటించిన దిల్ రాజు
- దిల్ రాజు ప్రొడక్షన్స్ (డీఆర్పీ) ప్రారంభం
- దిల్ రాజు కుమార్తె పర్యవేక్షణలో కార్యకలాపాలు
- డీఆర్పీ బ్యానర్ పై ప్రయోగాత్మక చిత్రాల నిర్మాణం
- తొలి చిత్రంగా జబర్దస్త్ వేణు దర్శకత్వంలో 'బలగం'
డీఆర్పీ బ్యానర్ పై ప్రయోగాత్మక చిత్రాలు చేస్తామని దిల్ రాజు తెలిపారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్నదే కొత్త బ్యానర్ ప్రారంభించడానికి ప్రధాన కారణం అని తెలిపారు. ఈ సంస్థ నుంచి ప్రథమంగా బలగం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. జబర్దస్త్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని తెలిపారు.