ఏపీ సీఎస్ రేసులో కొత్త పేరు... గిరిధర్ అరమణే!
- ప్రస్తుతం రక్షణశాఖ కార్యదర్శిగా ఉన్న గిరిధర్ అరమణే
- నేడు ఏపీ సీఎం జగన్ తో సమావేశం
- రక్షణ శాఖ నుంచి అరమణేను రిలీవ్ చేయాలని కేంద్రానికి ఏపీ లేఖ?
కాగా, ఈ భేటీ నేపథ్యంలో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఏపీ సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన గిరిధర్ అరమణే కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొత్త సీఎస్ కోసం ఏపీ సర్కారు కసరత్తులు చేస్తున్న సమయంలోనే గిరిధర్ అరమణే సీఎం జగన్ ను కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అటు, రక్షణ శాఖ నుంచి అరమణేను రిలీవ్ చేయాలని ఏపీ సర్కారు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది.
ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం నవంబరు 30తో ముగియనుంది. అయితే, నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి దాదాపు ఖాయమని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, సీఎం జగన్ తో నేడు గిరిధర్ అరమణే భేటీతో సీఎస్ రేసు ఆసక్తికరంగా మారింది.