అర్జెంటుగా చికెన్ 65 చేయడం నేర్చుకోవాలంటున్న షారుక్ ఖాన్
- అట్లీ దర్శకత్వంలో 'జవాన్'లో హీరోగా నటిస్తున్న షారుక్
- 30 రోజుల షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర యూనిట్
- నయనతార, విజయ్ సేతుపతి, అనిరుధ్‌తో సెట్స్ విశేషాలను పంచుకుంటూ షారుక్ ట్వీట్
‘30 రోజులు చాలా అద్భుతంగా గడిచాయి. తలైవా రజనీకాంత్ మా సెట్స్‌కు వచ్చి ఆశీర్వదించారు. నయనతారతో కలిసి సినిమా చూశా. అనిరుధ్ తో కలిసి పార్టీ చేసుకున్నా. విజయ్ సేతుపతి తో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. తలపతి విజయ్ ఎంతో రుచికరమైన ఆహారం తినిపించారు. గొప్ప ఆతిథ్యం ఇచ్చిన అట్లీ, ప్రియకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను చికెన్ 65 చేయడం నేర్చుకోవాలి’ అని షారుక్ ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో షారుక్, నయనతార, విజయ్ సేతుపతితో పాటు ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు కూడా నటించారు. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.