లైగర్ నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది
- ‘ఆఫట్’ పాటను విడుదల చేసిన చిత్ర బృందం
- తెలుగు వెర్షన్ కు భాస్కరభట్ల సాహిత్యం
- ఈ నెల 25న విడుదల అవుతున్న చిత్రం
పియూష్, షాజియా కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో విజయ్ సాఫ్ట్ స్టెప్స్ తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో అనన్య, విజయ్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా ఉంది. వాస్తవానికి ఈ పాటను శుక్రవారమే విడుదల చేయాలనుకున్నా.. సాంకేతిక కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా వచ్చింది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు. ఈ నెల 25న హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ తో పాటు అక్డి పక్డి పాట, వాట్ లగా దేంగే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మైక్ టైసన్, రోనిత్ రాయ్, విషురెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో పూరి, చార్మి, కరణ్ జొహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.