విజయ్ దేవరకొండకు ఇష్టమైన పుస్తకాలు ఇవేనట!
- పుస్తక పఠనంపై విజయ్ కు ఆసక్తి
- పలు పుస్తకాల గురించి వివరణ
- 'ద ఫౌంటెన్ హెడ్' అందరూ చదవాలని సూచన
అయాన్ ర్యాండ్ రాసిన 'అట్లాస్ ష్రగ్ డ్' కూడా చదవదగినదేనని విజయ్ పేర్కొన్నారు. ఇవేకాకుండా, రష్యన్ రచయిత కాన్ స్టాంటిన్ స్టానిస్లోవ్ స్కీ రాసిన 'యాన్ యాక్టర్ ప్రిపేర్స్', 'బిల్డింగ్ ఏ క్యారెక్టర్' పుస్తకాలు కూడా తనను ఆకట్టుకున్నాయని తెలిపాడు. నటన గురించి స్టానిస్లోవ్ స్కీ రాసిన ఈ పుస్తకాలను ఒకసారి చదివితే అర్థం చేసుకోలేమని, పలుమార్లు చదివిన తర్వాత తనకు అందులోని విషయాలు ఎంతో చక్కగా బోధపడ్డాయని వివరించారు.
ఇక, స్టీఫెన్ ఆర్ కాన్వే రచించిన 'ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్', 'డాక్టర్ స్పెన్సర్ జాన్సన్' రచించిన 'హూ మూవ్డ్ మై చీజ్?' పుస్తకాలను చదువుతున్నప్పుడు కూడా తాను ఎంతగానో ఆస్వాదించానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఈ రెండు పుస్తకాలు మోటివేషనల్ అంశాలకు సంబంధించిన పుస్తకాలని, ఇందులో 'హూ మూవ్డ్ మై చీజ్ పుస్తకం' చిన్నదే అయినా ఎంతో విషయం ఉన్న పుస్తకం అని వివరించారు.