మహేశ్ 30వ సినిమా డైరెక్టర్ గా సుకుమార్?
- హ్యాట్రిక్ హిట్ తో ఉన్న సుకుమార్
- 'పుష్ప 2' కోసం జరుగుతున్న కసరత్తు
- లైన్లోనే ఉన్న విజయ్ దేవరకొండ
- ఆ తరువాత ప్రాజెక్టు మహేశ్ బాబుతోనే అంటూ టాక్
ప్రస్తుతం ఆయన 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో గానీ .. మరో హీరోతో గాని చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా తరువాత మాత్రం మహేశ్ బాబుతో సెట్స్ పైకి వెళ్లనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ మహేశ్ బాబు కథను వినడం జరిగిపోయిందని చెబుతున్నారు.
ఈ లోగా త్రివిక్రమ్ తో సినిమాను .. రాజమౌళి ప్రాజెక్టును మహేశ్ బాబు పూర్తిచేస్తాడట. ఆ తరువాత ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళతారన్న మాట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన '1 నేనొక్కడినే' ఆశించినస్థాయి వసూళ్లను రాబట్టలేదు గానీ .. మంచి ప్రయత్నం అనిపించుకుంది.