మళ్లీ యాక్షన్ మొదలెడుతున్న 'భోళా శంకర్'
- 'భోళా శంకర్' గా చిరంజీవి
- తాజా షెడ్యూల్ ఈ రోజునే మొదలు
- రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్
- వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్
తాజా షెడ్యూల్ ను ఈ రోజు నుంచి మొదలుపెడుతున్నారు. ఈ షెడ్యూల్ ను కూడా యాక్షన్స్ సీన్స్ తోనే మొదలుపెడుతున్నారు. చిరంజీవి తదితరులపై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు. రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో ఈ ఫైట్ సీన్ చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమా హైలైట్స్ లో ఈ ఫైట్ ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
తమిళంలో ఆ మధ్య భారీ విజయాన్ని నమోదు చేసిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆయన సరసన నాయికగా తమన్నా అందాల సందడి చేయనుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.