మహేశ్ తో తలపడే విలన్ విషయంలో వచ్చేసిన క్లారిటీ!
- మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు
- త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో మూడో సినిమా
- జులై నుంచి సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు
- ప్రతినాయకుడిగా కనిపించనున్న తారకరత్న
ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడం వలన, ఆ రోజున ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలే ఛాన్స్ ఉందని అంటున్నారు. జులైలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఈ సినిమాలో విలన్ గా తారకరత్న పేరు వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవమెంత అనే సందేహం అందరిలోనూ ఉంది. ఆ సందేహాలకు తెర దించుతూ తారకరత్న తాను మహేశ్ 28వ సినిమాలో చేయనున్నట్టు ఒక ట్వీట్ చేశాడు. విలనిజానికి సంబంధించిన ఒక ఎమోజీని జోడించాడు. గతంలో విలన్ పాత్రలు చేసిన అనుభవం తారకరత్నకు ఉంది. ఇక ఈ సినిమాలో ఆయన పాత్రను ఎలా డిజైన్ చేశారనేది చూడాలి.