షూటింగ్ లో గాయపడ్డ విజయ్ దేవరకొండ, సమంత?
- విజయ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'
- కశ్మీర్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రం
- ఓ యాక్షన్ సీన్ సందర్భంగా నీటిలో పడిపోయిన విజయ్, సమంత
మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత గాయపడ్డారనేది ఆ వార్త సారాంశం. కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో చిత్రీకరించిన ఒక స్టంట్ సీన్ లో... లిడ్డర్ నదిపై తాడుతో నిర్మించిన వంతెనపై నుంచి వాహనాన్ని నడపాల్సి ఉందట.. ఆ సీన్ చేస్తున్నప్పుడు వాహనం నీటిలో పడటంతో ఇద్దరికీ గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వీరిద్దరికీ చికిత్స అందించారట. అయితే, ఈ ప్రమాదంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.
మరోవైపు కశ్మీర్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఖుషి' టీమ్ హైదరాబాద్ కు పయనమైంది. జూన్ లో రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న ఇది విడుదల కానుంది. రొమాంటిక్ లవ్ స్టోరీ, థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.