సమంత .. విజయ్ దేవరకొండ మూవీ 'ఖుషి' ఫస్టులుక్ మోషన్ పోస్టర్ రిలీజ్!
- 'మజిలీ' తరువాత శివ నిర్వాణ నుంచి మరో ప్రేమకథ
- ఆయన దర్శకత్వంలో సమంత చేస్తున్న రెండో సినిమాగా 'ఖుషి'
- తొలిసారిగా విజయ్ దేవరకొండతో జత కట్టిన సమంత
- ఆసక్తిని రేకెత్తిస్తున్న మోషన్ పోస్టర్
- డిసెంబర్ 23వ తేదీన సినిమా విడుదల
విజయ్ దేవరకొండ - సమంత జోడీ అనేసరికి సహజంగానే అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాకి 'ఖుషి' అనే టైటిల్ ను ఖరారు చేయడంతో అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ మోషన్ పోస్టర్ ను వదిలారు. విజయ్ దేవరకొండ మోడ్రన్ లుక్ తో కనిపిస్తుంటే, సమంత సంప్రదాయ బద్ధమైన లుక్ తో కనిపిస్తోంది.
ఈ ఇద్దరికీ కొంగుముడి వేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా అప్పుడే ప్రకటించడం విశేషం. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 'యశోద' తరువాత సమంత .. 'లైగర్' తరువాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ఇది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.