అరెస్టయిన జిగ్నేష్ మేవానీకి ప్రకాశ్ రాజ్ సంఘీభావం
- పోలీసుల అదుపులో జిగ్నేష్ మేవానీ
- మోదీపై వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు
- నిన్న బెయిల్ ఇచ్చిన కోక్రాఝార్ కోర్టు
- అంతలోనే మరో కేసులో అరెస్ట్
"మహాత్మాగాంధీని చంపిన గాడ్సేనే స్వతంత్ర భారతదేశపు తొలి ఉగ్రవాది. గాడ్సేని గుండెల్లో పెట్టుకుని, పెదవులపై గాంధీ నామస్మరణ చేస్తూ కుహనా రాజకీయ నాయకుల పట్ల సిగ్గుపడాలి. ధైర్యంగా ఉండు జిగ్నేష్ మేవానీ... సత్యమే గెలుస్తుంది" అంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.