అనిల్ కపూర్ ను రంగంలోకి దింపుతున్న త్రివిక్రమ్!
- త్రివిక్రమ్ తాజా చిత్రానికి సన్నాహాలు
- కథానాయకుడిగా మహేశ్ బాబు
- జూన్ నుంచి సెట్స్ పైకి
- మహేశ్ పాత్రలో అనిల్ కపూర్
అలా త్రివిక్రమ్ సినిమాలను పరిశీలిస్తే ఉపేంద్ర .. బొమన్ ఇరానీ .. జయరామ్ .. సచిన్ ఖేడ్కర్ మొదలైనవారు కనిపిస్తారు. అలా ఈ సారి ఆయన బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ ను రంగంలోకి దింపుతున్నట్టుగా సమాచారం. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తన చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకుని వెళుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో మహేశ్ బాబు ఫాదర్ పాత్ర చాలా కీలకమైనదిగా కనిపిస్తుందట. ఈ పాత్రకి అనిల్ కపూర్ అయితే కరెక్టుగా సెట్ అవుతారని ఆయనను సంప్రదించారట. ఆ పాత్ర ఆయనకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన బాలీవుడ్ స్టార్స్ లో అనిల్ కపూర్ ఒకరని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.