'రాజ రాజ చోర' నచ్చిందన్న రవితేజ!
- 'రాజ రాజ చోర' చూశాను
- చివరి వరకూ ఎంజాయ్ చేశాను
- శ్రీవిష్ణు చాలా బాగా చేశాడు
- హసిత్ గోలి బాగా తీశాడు
తొలి రోజున తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, అదే ఊపుతో కొనసాగుతోంది. ఈ సినిమా చూసిన ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా, ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో రవితేజ కూడా చేరిపోయాడు.
'రాజ రాజ చోర' సినిమాను చూశాను .. చాలా సరదాగా .. సందడిగా ఉంది. మొదటి నుంచి చివరి వరకూ నవ్వించింది .. అక్కడక్కడా ఎమోషన్ కి గురిచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు బాగా నచ్చేసింది. శ్రీవిష్ణు చాలా బాగా చేశాడు .. హసిత్ గోలి ఒక మంచి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇంతటి వినోదాన్ని అందించిన టీమ్ కి అభినందనలు" అని చెప్పుకొచ్చాడు.