మళ్లీ షూటింగు మొదలెట్టిన ప్రకాశ్ రాజ్
- ఇటీవల ఓ షూటింగ్ లో గాయపడ్డ ప్రకాశ్ రాజ్
- ప్రకాశ్ రాజ్ కు చిన్నపాటి శస్త్రచికిత్స
- మణిరత్నం, కార్తీలతో కలిసి మధ్యప్రదేశ్ కు వెళ్లిన ప్రకాశ్ రాజ్
మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం మధ్యప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ కోసం ఓర్చాకు వెళ్తున్నామని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ బ్యానర్ల కింద అల్లిరాజా సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.