'మహాసముద్రం' నుంచి 'హే రంభ' సాంగ్ రిలీజ్!
- అజయ్ భూపతి నుంచి 'మహా సముద్రం''
- యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
- చైతన్ భరద్వాజ్ సంగీతం
- రంభను గుర్తుకు తెచ్చే స్పెషల్ సాంగ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం 'హే రంభ' అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 90వ దశకంలో గ్లామరస్ హీరోయిన్ గా రంభ ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాలో కథా పరంగా జగపతిబాబు .. శర్వానంద్ తదితరులు మాస్ ఏరియాలో ఉంటూ ఉంటారు .. వాళ్లంతా రంభ అభిమానులు. ఫుల్లుగా తాగేసి ఆమె అందచందాలపై పాడుకునే పాట ఇది.
చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకు, భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. ఇది కేవలం మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన పాట .. తీసిన పాట. జగపతిబాబుతో చాలా రోజుల తరువాత స్టెప్పులు వేయించిన పాట. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు.