'మా' ఎన్నికల వేళ సినీనటుడు బ్రహ్మాజీ జోక్!
- మా ఎన్నికలపై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో చర్చలంటూ సెటైర్లు
- జిన్ పింగ్ ఫొటోను వాడిన బ్రహ్మాజీ
- ఇది మర్యాదపూర్వక భేటీయేనంటూ చురక
- జిన్ పింగ్ పలు సలహాలు ఇచ్చాడని వ్యాఖ్య
ఈ ఎడిటింగ్ ఫొటోలో నటుడు బ్రహ్మాజీకి జిన్ పింగ్ షేక్‌హ్యాండ్ ఇవ్వాలని చూడడం, అందుకు బ్రహ్మాజీ భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్కారం పెట్టడం చూడొచ్చు. ‘ఇది మర్యాదపూర్వక భేటీయే.. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు. అయితే, మా ఎన్నికల గురించి మాత్రం చర్చలు జరిపాం. జిన్ పింగ్ పలు సలహాలు ఇచ్చాడు’ అని బ్రహ్మాజీ చమత్కరించాడు.