త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ఆగిపోలేదట!
- త్రివిక్రమ్ తో సెట్ పైకి వెళ్లాలనుకున్న ఎన్టీఆర్
- కొన్ని కారణాల వలన ఆగిన ప్రాజెక్టు
- వెసులుబాటు కోసమే ప్రాజెక్టుల మార్పు
- త్వరలోనే మరోసారి సెట్స్ పైకి
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం కూడా జరిగింది. అందువల్లనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పుకున్నారు. కానీ ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా ఆగిపోలేదట. ఇద్దరూ కూడా ఒక వెసులుబాటు కోసం ప్రస్తుతానికి మాత్రమే ఈ ప్రాజెక్టును పక్కకి పెట్టారని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తిచేసిన తరువాత, త్రివిక్రమ్ ప్రాజెక్టుపైకి ఎన్టీఆర్ వెళ్లనున్నాడని చెబుతున్నారు. 'అరవింద సమేత' హిట్ తరువాత ఈ కాంబినేషన్లో మరో సినిమా రానుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమే.