'ఆర్ఆర్ఆర్' సెట్లోకి అడుగుపెట్టిన చరణ్!
- భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా
- యాక్షన్ సన్నివేశాలు హైలైట్
- కరోనా కారణంగా ఆగిన షూటింగ్
- మళ్లీ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లిన చరణ్
ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా, చరణ్ తో పాటు సెట్స్ కి వచ్చాడు. ఈ సందర్భంగా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో, కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఇటు చరణ్ ఫ్యాన్స్ .. అటు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.