సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- చరణ్ సరసన అలియా మరోసారి?
- రికార్డు రేటుకి 'ఆర్ఆర్ఆర్' హక్కులు
- ఫుట్ బాల్ ఆటగాడిగా నాని
* ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన బిజినెస్ కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ హక్కులను ZEE 5 సంస్థ 325 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు డిజిటల్ హక్కుల పరంగా ఒక భారతీయ చిత్రానికి ఇంతటి రేటు రాలేదనే చెప్పాలి.
* గతంలో 'భీమిలి కబడ్డీ జట్టు', 'జెర్సీ' వంటి స్పోర్ట్స్ ప్రధాన కథా చిత్రాలలో నటించిన నేచురల్ స్టార్ నాని త్వరలో మరో స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. ఓ కొత్త దర్శకుడు రూపొందించే చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నాని కనిపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.