రవితేజ 'ఖిలాడి' విడుదల వాయిదా!
- 'క్రాక్'తో హిట్ కొట్టిన రవితేజ
- వేగంగా వర్క్ చేస్తూ వెళ్లిన 'ఖిలాడి'
- లైన్లో రెండు సినిమాలు
ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చుననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' సినిమాతో తొలి హిట్ ను అందుకున్న రవితేజ, చాలా వేగంగా 'ఖిలాడి' సినిమాను రెడీ చేశాడు. అయితే కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటం వలన, ఈ సినిమా విడుదలను ఆపేశారు. ఈ సినిమా తరువాత శరత్ మండవ .. త్రినాథరావు నక్కిన సినిమాలను రవితేజ లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.