వికారాబాద్ అడవుల్లో బాలయ్య భారీ ఫైట్!
- భారీగా అంచనాలు పెంచుతున్న'అఖండ'
- శ్రీకాంత్ విలనిజం ప్రత్యేక ఆకర్షణ
- హ్యాట్రిక్ హిట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, బాలకృష్ణ రైతు పాత్రలోను .. అఘోర పాత్రలోను కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలకి మధ్య గల సంబంధం ఏమిటి? ఏ పాత్ర నుంచి ఏ పాత్రకి బాలకృష్ణ టర్న్ అవుతాడు? అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్ విలనిజం ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఏ స్థాయిలో ఆయన అభిమానులను అలరిస్తుందో చూడాలి. వాళ్లు మాత్రం ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.