కీర్తి సురేశ్ తాజా చిత్రానికి ఓటీటీలో మంచి ఆఫర్!
- కీర్తి సురేశ్ 'పెంగ్విన్'కి అంతగా రాని రెస్పాన్స్
- నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి'
- సుమారు 13 కోట్లకు కొన్న అమెజాన్ ప్రైమ్
అయితే, ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ కనపడకపోవడంతో ఆమె తదుపరి చిత్రాలకు ఓటీటీలో మార్కెట్ సమస్య ఎదురవ్వచ్చని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన మరో చిత్రం 'గుడ్ లక్ సఖి'ని కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థే తీసుకుంది. పైగా దీనికి 13 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు సమాచారం. దీనిని కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఇక ఇందులో కీర్తి సురేశ్ పల్లెటూరి పిల్లగా నటించింది. ఆమెకు ప్రతి విషయంలోనూ దురదృష్టం ఎదురవుతుండడంతో అంతా ఆమెను 'బ్యాడ్ లక్ సఖి' అంటుంటారు. అలాంటి అమ్మాయి కృషి, పట్టుదలతో జాతీయ స్థాయి షార్ప్ షూటర్ గా అవార్డు గెలుచుకుని 'గుడ్ లక్ సఖి' అనిపించుకుంటుంది. నగేశ్ కుకునూర్ దీనికి దర్శకత్వం వహించాడు.