అదంతా పుకారేనన్న హరీశ్ శంకర్!
- పవన్ కల్యాణ్ తో హరీశ్ మూవీ
- మానస రాధాకృష్ణన్ హీరోయిన్ అంటూ టాక్
- పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన హరీశ్ శంకర్
మలయాళ భామలు తెలుగు తెరపై తమ జోరు చూపుతున్న కారణంగా అంతా ఈ వార్త నిజమేనని అనుకున్నారు. అయితే, అందులో ఎంత మాత్రం నిజం లేదని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ వార్త కేవలం పుకారు మాత్రమేనని చెప్పారు. తన సినిమాలకి సంబంధించిన వివరాలను తానే స్వయంగా తెలియజేస్తానని అన్నారు. ఈ పుకారు ఎక్కడ పురుడు పోసుకుందో తెలియదుగానీ, హరీశ్ శంకర్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక ఇప్పుడు పవన్ సరసన కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననేది ఆసక్తికరంగా మారింది.