పవన్ .. హరీశ్ శంకర్ మూవీ టైటిల్ ఖరారైనట్టే
- మాస్ దర్శకుడిగా హరీశ్ శంకర్
- పవన్ తో సినిమాకి సన్నాహాలు
- టైటిల్ గా 'ఇప్పుడే మొదలైంది'
ఈ సినిమాకి 'ఇప్పుడే మొదలైంది' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. అసలైన ఆట 'ఇప్పుడే మొదలైంది' అనే అర్థం వచ్చేలా వున్న ఈ టైటిల్ పవర్ఫుల్ గానే వుంది .. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిగానే వుంది. క్రిష్ దర్శకత్వంలో చేయనున్న సినిమా పూర్తయిన తరువాత, హరీశ్ శంకర్ తో కలిసి పవన్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే హరీశ్ శంకర్ కథను సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.