పవన్ సరసన నాయికగా మానస రాధాకృష్ణన్!
- తెలుగు తెరపై మలయాళ భామల జోరు
- కేరళలో పుట్టిన మానస రాధాకృష్ణన్
- మలయాళంలో 10 సినిమాలు చేసిన అనుభవం
ఈ సినిమాలో కథానాయికగా మానస రాధాకృష్ణన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేరళలో పుట్టిన ఈ సుందరి, దుబాయ్ లో పెరిగింది. ఇంతవరకూ 10 మలయాళ చిత్రాలలో నటించిన మానస రాధాకృష్ణన్, తెలుగులో పవన్ కల్యాణ్ జోడీగా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయవలసి వుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో 'పరమగురు' సినిమా చేస్తోంది. పవన్ తో చేసే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.