అలాంటి వారితో సంబంధం తెంచుకోవడమే ఉత్తమం: షాలిని పాండే
- మనపై ఎవరైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తే భరించలేం
- అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది
- వారితో సంబంధాలు తెంచుకోవడమే ఉత్తమం
ఎవరైనా మనపై ఆధిపత్యాన్ని చెలాయిస్తే భరించలేమని షాలిని చెప్పింది. మనపై ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకూడదని తెలిపింది. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని... వారు మనకు ఎంత కావాల్సిన వారైనా సంబంధాలను తెంచుకోవడమే ఉత్తమమని చెప్పింది. అలాంటి వారిని తాను ఒక్క క్షణం కూడా భరించలేనని... వారిని దూరంగా పెడతానని, లేకపోతే వారికి తాను దూరంగా వెళ్లిపోతానని తెలిపింది.