యాక్షన్ లోకి దిగిపోతున్న మంచు హీరో
- మంచు మనోజ్ నుంచి 'అహం బ్రహ్మాస్మి'
- రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు
- అఘోరగా కనిపించనున్న మనోజ్
తదుపరి షెడ్యూల్ ను మే నెల మొదటివారం నుంచి ప్రారంభించనున్నారు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ అఘోర లుక్ తోను కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.