'అహం బ్రహ్మాస్మి' నుంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న ఫస్టులుక్
- నిర్మాతగా మారిన మనోజ్
- సాహసంతో కూడిన ప్రయత్నం
- నాలుగు భాషల్లో విడుదల
విభూతి రేఖలపై కుంకుమ రేఖను ధరించిన ఆయన లుక్ విభిన్నంగా వుంది. మనోజ్ చెప్పినట్టుగానే ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో .. విభిన్నమైన కాన్సెప్ట్ తో మనోజ్ సాహసంతో కూడిన ప్రయోగమే చేస్తున్నాడు. నిర్మాతగా .. కథానాయకుడిగా ఆయన చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.