నా కాలు విరగడానికి కారణం వాళ్లు కాదు: హీరో నాగశౌర్య
- అన్బు - అరివు మంచి ఫైట్ మాస్టర్స్
- రియాలిటీ కోసం నేనే దూకేశాను
- వాళ్లు చెప్పినా వినిపించుకోలేదన్న నాగశౌర్య
"ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్రాధాన్యత ఎక్కువ. అందువల్లనే 'కేజీఎఫ్' సినిమాకి పనిచేసిన అన్బు - అరివు అనే స్టంట్ మాస్టర్స్ ను తీసుకున్నాము. ఓ ఛేజింగ్ సీన్లో నన్ను దూకవద్దనీ .. డూప్ పెడదామని వాళ్లు చెప్పారు. డూప్ అని ప్రేక్షకులు పసిగడితే కథలో నుంచి బయటికి వస్తారని చెప్పేసి, నేనే చేస్తానని అన్నాను. రోప్ కూడా వాడకూడదని అనుకున్నాను. ఆ సీన్లో పరిగెడుతూ 5వ అంతస్తు నుంచి పడిపోయాను. దాంతో కాలు విరిగి కొన్ని రోజుల పాటు బాధ పడవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.