కోలీవుడ్ ను ఊపేస్తున్న 'జిగిడీ కిల్లాడి' సాంగ్
- ధనుశ్ తాజా చిత్రంగా 'పటాస్'
- కథానాయికగా మెహ్రీన్
- సంగీత దర్శకుడిగా అనిరుధ్
తమిళంలో ధనుశ్ 'పటాస్' అనే సినిమా చేస్తున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. అనిరుధ్ పాడిన ఈ పాట ఇప్పుడు కోలీవుడ్ ను ఒక ఊపు ఊపేస్తోంది. 'జిగిడీ కిలాడి' అంటూ సాగే ఈ పాట, తెరపై ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి. ఒక కీలకమైన పాత్రలో స్నేహ నటిస్తున్న ఈ సినిమాను, జనవరి 16వ తేదీన విడుదల చేయనున్నారు.