నాగేశ్వర రెడ్డి నుంచి మరో విభిన్న కథా చిత్రం
- హాస్య చిత్రాల దర్శకుడిగా నాగేశ్వర రెడ్డి
- పట్టాలపైకి మరో ప్రాజెక్టు
- 'అల్లరి' నరేశ్ ను సెట్ చేసే ఛాన్స్
'యాక్షన్' సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ఆడెపు శ్రీనివాస్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగేశ్వరరెడ్డి తన దగ్గరున్న కథకు తగిన హీరోను వెతికి పట్టుకునే పనిలో వున్నాడని అంటున్నారు. 'అల్లరి' నరేశ్ తో ఆయనకి మంచి హిట్స్ వున్నాయి గనుక, ఈ హిట్ కాంబినేషన్ మరో మారు సెట్ అవ్వచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.