'పెళ్లి చూపులు' హీరోయిన్ కి మరో ఛాన్స్ తగిలింది
- 'పెళ్లి చూపులు'తో రీతూ వర్మకి మంచి పేరు
- ఆశించిన స్థాయిలో లేని అవకాశాలు
- త్వరలో నాగశౌర్య జోడీగా సెట్స్ పైకి
తాజాగా తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లినట్టుగా సమాచారం. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. నాగశౌర్య కథానాయకుడిగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయికగా రీతూవర్మను ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.