'చంద్రముఖి' తరువాత రజనీ సినిమాలో జ్యోతిక
- రజనీ తాజా చిత్రంగా రానున్న 'దర్బార్'
- శివ దర్శకత్వంలో తదుపరి చిత్రం
- తెరపైకి మంజూ వారియర్ - జ్యోతిక పేర్లు
మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో .. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. రజనీ సరసన నాయికగా మంజూ వారియర్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా తెరపైకి జ్యోతిక పేరు కూడా వచ్చింది. ఈ సినిమా కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. మరో కథానాయికగా గానీ .. కీలకమైన పాత్ర కోసం గాని ఆమెతో మాటలు జరుగుతూ ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'చంద్రముఖి'లో రజనీ .. జ్యోతిక కలిసి ఏ స్థాయిలో మెప్పించారనే విషయం తెలిసిందే.