యూఎస్ లో దుమ్మురేపేస్తోన్న 'సైరా'
- నిన్న విడుదలైన 'సైరా నరసింహా రెడ్డి'
- యూఎస్ లో 1 మిలియన్ వసూళ్లు
- మరింత పుంజుకోనున్న వసూళ్లు
అక్కడ కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. దాంతో వారాంతపు సెలవుల్లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. బలమైన కథాకథనాలు .. భారీ బడ్జెట్ .. వివిధ భాషల్లో క్రేజ్ వున్న ఆర్టిస్టులు ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణమని చెప్పుకుంటున్నారు. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ కి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.