3 రోజుల పాటు 10 థియేటర్లలో సందడి చేయనున్న 'ఇస్మార్ట్ శంకర్'
- హిట్ చిత్రంగా నిలిచిన 'ఇస్మార్ట్ శంకర్'
- తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రిలీజ్
- 3 రోజుల పాటు సందడి చేయనున్న సినిమా
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఓ 10 థియేటర్స్ లో మరోసారి ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని దిల్ సుఖ్ నగర్ - వెంకటాద్రి, వరంగల్ - లక్ష్మణ్, కరీంనగర్ - తిరుమల, ఖమ్మం - ఆదిత్య, ఖాజీపేట - భవాని థియేటర్స్ లో ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి - ఊర్వశి, కాకినాడ - దేవి, తిరుపతి - విఖ్యాత్, గుంటూరు - స్వామి, వైజాగ్ - గోకుల్ థియేటర్స్ లో అదే రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 27 .. 28 .. 29 తేదీలలో ఈ సినిమా ఈ థియేటర్స్ లో సందడి చేయనుంది.